Tuesday, June 1, 2010

తెలుగు న్యూస్ చానల్స్, మనకు అవసరమా?

కొన్ని సంవత్సరాల క్రితం, వార్తలు అంటే దూరదర్శన్ 8 లో  సాయింత్రం ఏడు గంటలకు వచ్చీ కొన్ని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి లో జరిగిన ముఖ్య ఘటనలు, క్రీడా రంగ వార్తలు మరియు వాతావరణ పరిస్తితి మాత్రమే. కాని ఈ రోజు వార్తలు అనే పదానికి అర్థం వేరు. డబ్బున్న ప్రతి సంస్థ లేదా వ్యక్తీ ఒక వార్తలు మాత్రం ప్రసారం చేసే చానెల్స స్థాపించడం తో ఇవాళ మనమందరం అనవసరమైన మానసిక ప్రభావానికి గురి అవుతున్నాం. 

బ్రేకింగ్ న్యూస్ పేరు తో మనందరినీ వెర్రి వాళ్ళని చేస్తున్న ఈ న్యూస్ చానల్స్ ని మనం ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎవరైనా సెల్ల్ఫోన్ స్థంబం ఎక్కినా, ఎ ఇంట్లో దొంగతనం అయినా, ఎవరో ఎవరినో తిట్టినా, ఎండ ఎక్కువగా ఉన్నా, ఎండ తక్కువగ ఉన్నా, వర్షం పడినా, వర్షం పదకపొఇనా ,కుక్క మొరిగినా, ఏదో సినిమా హీరో ఎవరినో ఏదో అన్నా, ఆవు ఇడ్లీ తిన్నా, కుక్కలు వెంట పడినా అసలు ఈలంటివి ఏదైనా జరిగినా, అవి వార్తలు అని సమర్పిస్తారు. వాళ్లకు చుపిచడానికి మతి లేదు అని అనుకోవచ్చు, కాని చూడడానికి మనకు బుద్ధి లేదా?

ఏదైనా హింసాత్మక  ఘటన జరిగితే , రక్తం, పోట్లాటలు, మల్ల యుద్ధాలు మళ్లీ మళ్లీ చూపిస్తారు. ఎందుకు? గత వారం జరిగిన ఒక సంఘటన లో ఒక ప్రముఖ వ్యక్తీ, నిస్సంకోచంగా బండ బూతులు తిడితే సాయింత్రం వరకు అదీ చూపెట్టారు. ఆవిడ తిట్టింది ఒక్కసారే కాని మనం అనుకుంది వేయి సార్లు. నిన్న ఎవరో ఆసిడ్ దాడి కి గురి అయినా ఒక అమ్మాయి కాలి పోయిన ముఖం TV స్క్రీన్ అంత కనిపించే లా జూమ్ చేయడం అవసరమా?.  ఎ రకంగా ఈ న్యూస్ చానల్స్ మన ఆలోచన పైన ప్రభావం చూపుతాయో ఒక్క సారి మనం ఆలోచించాలి.  చానల్స్ ఒక వ్యాపారం. వాళ్ళు చుపిచేవి వార్తలు కావు, అవసరమైనవి అసలే కావు. మరి అవి ఏంటి? అనవసరంగా మనందరిని మానసిక విస్మయానికి గురి చేసి, ఎ కారణం లేకుండా దిగులు పడేలా, ఒక మత్తుని అలవాటు చేస్తున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే మనము ఆ మత్తు కి ప్రతి రోజు అలవాటు పడుతున్నాం. ఈ మత్తు మన మెదడు వరకు చేరే ముందే మనం దీనిని బహిష్కరించే అవసరం మనకు ఎంతో ఉంది.
  
ఇస్రేల్ లో 200 మంది  బాంబు పేలి  చనిపోయినా, అక్కడి మీడియా ఆ వార్త ని ఒక చిన్న విషయం లా భావించి, ఎన్నో మంచి వార్తల మధ్యలో అస్సలు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రసారం చేస్తుంది. ఇదీ మనమందరం ఇస్రేల్ దెగ్గర నేర్చుకోవాల్సిన విషయాల్లో ఒక చాలా  ముఖ్యమైన విషయం. ఆనందం, ఉల్లాసం, మంచి ఫలితాలు, సాఫల్యం, ప్రోత్సాహం, స్ఫూర్తి ని ఇచ్చే న్యూస్ చానల్స్ ఇవాళ మనందరిని మనస్తాపానికి గురి చేస్తున్నాయి. చనిపోయిన బిడ్డ శవం ఇంకా వల్లకాటు కి చేరదు  కాని TV రిపోర్టర్ కెమెరామన్ తో పాటు ఆ ఇంటికి చేరుకుంటాడు. ఏడిచే ఆ అమ్మని ఓదార్చే సమయంలో తన స్పందన ఎలా ఉంది అని అడుగుతాడు. ఒక MLA ని చంపిన వ్యక్తీ ఇంటర్వ్యూ అర గంట చూపిస్తారు.  'ఫ్రీడం అఫ్ ప్రెస్' పేరుతొ మన అందరి ఆలోచనల పై విషం చల్లి, మనఅందరిని అనవసరంగా మనస్తాపానికి గురి చేస్తారు. 

ఈ న్యూస్ చానల్స్ ని నేను అడిగీ ప్రశ్న ఒక్కటే, "ఉద్రిక్తం", "విషాదం", "ఘోరం", "నేరం", "స్పందన", అనే పదాలు వాడకుండా ఒక్క రోజైనా వార్తలు చెప్పగలరా?


- దీపక్ కారముంగికర్ 
నా మాతృ భాష మరాఠీ. ఇది తెలుగు లో నా మొదటి బ్లాగ్ పోస్ట్. తప్పులు ఏమైనా ఉంటె క్షమించండి :-)

7 comments:

AK(Anirudh Koppula) said...

చాలు మామా జీవితానికి...తెలుగులో కుమ్మేసావు... :)

ఈనాటి న్యూస్ చానల్స్ లో వార్తలు తక్కువ వాదనలు ఎక్కువ... మనం చేస్కున్న ఖర్మ...

Harishankar said...

Deepak

I want it in English.

Else translate

Regards
Harishankar

Venkat Parthasarathy said...

This is from a famous mail forward - Thought it apt to share here:

మనం రోడ్ మీద వెళ్తూ ఉంటాం. ఒక కుక్క పిల్ల కాలు విరిగి కుంటుతుంటుంది. మనకి టైం ఉంటె ఆగి దానికి ఏమి కావాలొ చూస్తాం, లేదు అంటె అయ్యో పాపం అని జాలి పడి వెళ్ళిపోతాం.

tv-9 రిపోర్టర్ వెళ్తున్నాడు, వెంటనె tV-9 ఆఫిస్ కి ఒక ఫొన్ వెల్తుంది, వాడు కెమెరామెన్ ని పంపుతాడు.

ఇక మొదలు........

క్రిష్ణ ఆ కుక్క పరిస్తితి ఎలా ఉంది? ఎప్పటి నుంచి అక్కడ ఉంది?

ఈ కుక్క మార్నింగ్ నుంచి ఇక్కడే ఉంది, ఇప్పుడు కుంటుంతుంది......స్వప్న

ఆక్కడి వాళ్ళు ఏమన్న చెబుతున్నార?...క్రిష్ణ

స్వప్న...ఇక్కడి వాళ్ళు ఇది ఒక కుక్క అని, దాని కాలుకు దెబ్బ తగలటం వల్ల కుంటుతుంది అని చెప్తున్నారు. ఈ విదం గ గతం లొ ఆ కుక్క ఈ area లొ ఇలా కుంటలేదని, ఇదె తాము మొదటి సారి చూడటం అని చెప్తున్నారు

కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? .....క్రిష్ణ

కుక్క ప్రస్తుతం కుంటుతుంది స్వప్న. ఈ విదం గ కాలు కు దెబ్బ తగలటం కొత్త అనుకుంట, అందుకె కుంటటం రాక ఇబ్బంది పడుతుంది. మాట్లాడించటనికి ప్రయత్నించిన అది సమాధానం చెప్పకుండ, మూలుగుతుంది.....స్వప్న

థాంక్ యు క్రిష్ణ, ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి సమీక్షిస్తు ఉండటానికి మీకు కాల్ చేస్తూ ఉంటాం.


ఇది గాయపడి కుంటుతున్న కుక్క స్థితి మీద మా క్రైం ప్రతినిధి క్రిష్ణ అందించిన వివరాలు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..
బ్రేక్ తర్వాత కుక్కలు-కుంటుడు అంశం పై చర్చింటానికి ప్రముఖ Doctor కుక్కుటేశ్వర రావ్ గారు మన Studio కి వస్తున్నారు..


బ్రేక్ తర్వాత..........


రజనికాంత్ : చెప్పండి కుక్కుటేశ్వర్ రావ్ గారు గతం లొ మీరు ఎప్పుడైన ఇలా కుక్కలు కుంటటము చూసార? ఒక వేళ చూస్తె ఏ జాతి కుక్కలు కుంటటము చుసి ఉంటారు.

కుక్కుటేశ్వర్ : ఈ విదం గ కుక్కలు కుంటటం ఇది మొదటి సారి కాదు. ఫ్రపంచవ్యాప్తం గ ఎన్నో జాతుల కుక్కలు, ఎన్నో సందర్భాల్లొ ఇలా కుంటినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కుంటటానికి జాతి తో సంబందం లెదు.

రజనికాంత్: అంటె కుక్కలు కుంటేటప్పుడు వాటికి ఏమన్న బాధ ఉంటుందా? ఉంటె ఎటువంటి బాధ?

కుక్కుటెశ్వర్ : బాధ లొ రకాలు ఉండవండి. కుంటెటప్పుడు general గ దెబ్బ తలిగిన కాలు కి నొప్పి ఉంటుంది అని Dog's Medical Science లొ గట్టి ఆధారాలు ఉన్నాయి.


రజనికాంత్ : తాజా పరిస్థితి చెప్పేందుకు మా క్రైం ప్రతినిధి క్రిష్ణ టెలి ఫొన్ లొ సిద్దం గ ఉన్నారు...క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క పరిస్థితి ఎలా ఉంది.

క్రిష్ణ : (చెవిలొ ear piece పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు..)

క్రిష్ణ చెప్పండి..ఆ కుక్క ఫరిస్థితి ఎలా ఉంది?

రజిని ... కుక్క మూలుగుతుంది, ఇప్పుడె blue cross వాళ్ళు దానిని తీసుకువెళ్ళారు.


కుక్క కాలు కి దెబ్బ తగిలింది, దాని ఇతర శరీర భాగాలు ఎలా ఉన్నయి?...క్రిష్ణ

రజిని, కుక్క కాలు కి మాత్రమే దెబ్బ తగిలింది. కాని ఈ కుక్క తోక వంకర గా ఉంది.

వంకర అంటె ఎలా ఉంది...క్రిష్ణ (ఇప్పుడు రజిని మొహం లొ expressions ఇంకెక్కడా చూడలేము, శత్రువు టాంకర్ ని ద్వంసం చెయ్యటానికి wait చెస్తున్న soldier face లొ తప్ప)


రజిని వంకర గ అంటిచుకుని ఉంది, నేను ఇప్పటికి దానిని straight చెయ్యటనికి try చెతున్నాను కాని అది చుట్టుకుపొతుంది. బహుశ కాలు కి దెబ్బ తగలటం వల్ల అని నా ఉద్దెశం.

థాంక్ యు క్రిష్ణ....కుక్కుటెశ్వర్ గారు, కాలు కి దెబ్బ తగలటం వల్ల తోక వంకర అయ్యి ఉంటుంది అని మా ప్రతినిధి క్రిష్ణ చెప్తున్నారు, దీని పై మీ స్పందన ఏంటి?

స్పందన అంటె ఏమి ఉంటుంది రా పుండకార్ వెధవ...కుక్క తోక కాలు కి దెబ్బ తగలటం వల్ల వంకర అయ్యేది ఏంటి ర ధేడ్ దిమాగ్ గ. ఏమి మనిషివి ర నువ్వు, ఇప్పటి వరకు నువ్వు రాసి ఇచిన answers చదివాను, ఇంక నా వల్ల కాదు, నా టి మరిగిపొతూ ఉంటుంది. బంగారం లాంటి మల్లయ్య అనే పేరు మార్చి కుక్కుటెశ్వర్ రావ్ అని మార్చి, షర్ట్, పాంట్ రెంట్ కి తెచ్చి నాకు ఇచ్చి డాక్టర్ లాగ act చెయ్యలా? ఇల act చేస్తె నా tea కొట్టు నుంచి ఎదురు గ ఉన్న మీ tV-9 office కి రొజు 100 tea లు ఆర్డెర్ ఇస్తారా. మనస్సాక్షి ఉందంట్ర వెధవ *్*్*్*.దొంగ నా &%%్**( గాలి న &$%్**.. మీ బతుకులు చెడ....)

(ఇలా తిడుతు ఉండగానె, tV-9 లోగొ వచ్చి, మెరుగైన సమాజం కొసం చుస్తూనే ఉండండి tV-9 అని voice వినిపించి ads రావటం మొదలవుతాయి..)

Ravi said...

mama this is awesome...!
u rocks evan in telugu.. :)

jyothipriya said...

U r simply superb deppak.
ur multi talented.
I am a big fan of ur stories.
u r 100% right.
media antey 4 th estate antatru but eppudu unna channels only ratings kosam present chestunnayi.

GAYATRI said...

hehehe...bahu bagundi anna! bhala!! :)
intiki vachcinappudu ide telugulo matladali next time! :P

Raja sekhar said...

Guess which India local language has most number of news channels...Non other than Telugu.... we need masala ..than any thing else... Chi meee pappu chharu mokalaki Thaalimpu petta....