ఫేస్బుక్ ఒక చాల మంచి ఐడియా. దాన్నికరెక్ట్ గా వాడుకుంటే చాలా బాగుంటుంది. కానీ కొంత మంది ఫేస్బుక్లొ వేసే వేషాల వల్ల మనుషులకి చిరాకేసి కోట శ్రీనివాస రావు గారి స్టైల్ లొ 'ఈ ఫేస్బుక్ ఎవడు కనపెట్టాడు రా బాబు ' అని అనాల్సొస్తుంది. పోనీ, పని పాట లేదు, బేవార్స్ గా ఉన్నాడు, ఏదో సరదా కి చేస్తున్నాడు అని అనుకుంటే, మంచి హోదా లొ ఉండి, 24 రాళ్ళూ సంపాదిస్తూ యదవ లా ప్రవర్తిస్తారు.
ఇక అందిరికి చిరాకేసే విషయం ఏంటంటే టాగ్స్. అమ్మ తోడు అడ్డంగా ట్యాగ్ చేస్తా అనుకోని కొంత మంది పండగ కోసం కాస్కోని కూర్చుంటారు. ఎనీ పండగ సింగల్ హ్యాండ్ అనుకుంటూ ఫోటోషాప్ ధీరులు ఎక్కడెక్కడనించో టెంప్లేట్ దొంగతనానికి పాలుపడి రెడీ గా ఉంటారు. కాని, రాఖి పండగ రోజు మాత్రం ఎవ్వడు కనపడడు.
ఈ ఫోటోషాప్ ని వాడి కొంత మంది వాళ్ళ చిత్రాలతో చిత్రహింసలు పెడతారు. తన వెనుకాల సింహాలు, పులులు, బాక్గ్రౌండ్ లొ హిమాలయాలు పెట్టుకునే వాళ్ళు ఒక రకమయితే కాజల్ అగర్వాల్ పక్కన నిలపదినట్టు, ఇలియానా తన వాడిలొ కూర్చున్నట్టు చేయించుకునే వాళ్ళు ఇంకో రకం. బాబుల్లారా, మీ ఆసలు బాగా నే ఉన్నాయి. కాని, సమాజం పట్ల కొంచం దయా దాక్షిణ్యాలు ఉంటె బాగుంటుంది.
ఫర్మ్విల్లె ఆడే వాళ్ళు, రకరకాల apps వాడి గోడ ను పాడు చేసే వాళ్ళు, బూతు బొమ్మ కనిపియగానే చొంగ కరచుకొని క్లిక్ చేసి సిగ్గు లేకుండా LOOLLZZZ అని స్టేటస్ రాస్కునే వాళ్ళతో మనం కనీస జాగ్రత్త వహించాలి. వీళ్ళకి ఎందులో పడితే అందులో వేలు పెట్టె అలవాటు బాగా ఉంటుంది. న్యూస్ ఛానల్ కి కూడా పనికిరాని రకం వీళ్ళు.
ఇక ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్ని రాస్తే ఈ పోస్ట్ కూడా అమ్మమ్మ.com అవుతుంది. కాని ఈ కొన్నినియమాలను అనుసరిస్తే మీ ఫేస్బుక్ జీవితం RTC బస్సు ప్రయాణం లాగా సురక్షితం, సుఖవంతం అవుతుంది.
- తెలియని విషయాలలో వేలు పెట్టరాదు.
- కాజల్ అగర్వాల్ ఫోటో డిస్ప్లే లొ పెడితే, అమ్మాయి ఆవరేజ్
- డిస్ప్లే ఫోటో లొనల్ల కళ్ళజోళ్ళు పెట్టుకున్నచో మిమ్మలిని అమ్మాయిలు ఆడ్ చేస్కుంటారు అన్నది ఒక అపూహ, భ్రమ.
- ఇచ్చ్చాట పెళ్లి సంమంధాలు చూడరాదు.
- మీ మగతనాన్ని చాటడానికి వైరస్ వీడియో లింక్ ని క్లిక్ చేయరాదు. మన సంస్కృతి నేర్పిన తండ్రి కూతుర్ల బంధాన్ని గౌరవించండి
- ఫేస్బుక్ మనందరిది. దీనిని పరిశుభ్రంగా ఉంచుదాం.
- దీపక్ కారాముంగికర్
18 comments:
Awesome, Super, Hard hittingly fantastic.... Liked the language flow.... To put it in Telugu - Kekaa!
Jiyo !!!
ఈలలు ఈలలు :-)
Raccha thopu turumu anni !
అచ్చ తెలుగులో చెప్పాలంటే : 'అద్భుతః '
Adirindi I especially loved
ధర్మవరపు సుబ్రహ్మణ్యం మిస్టర్ పెళ్ళాం లొ A V S గారికి జోహార్లు పలికినట్టు, 'వాట్ ఎ ఇడ్లీ, ఆహా వాట్ ఎ వొంకాయ కూర' అని కామెంట్ రాయకుండా ఉండలేడు.
న్యూస్ ఛానల్ కి కూడా పనికిరాని రకం వీళ్ళు....ఇంత కన్నా ఘొరమైన తిట్టు ఇంకొటి లేదు బాబూ..ఛీ నా మొఖానికి తాలింపు పెట్టా
ahhahha!!! adirindayya deepak! nuvvu cheppina vishayalannitithonu nenu ekibhavistunna. Ee picchi ville lu adevallani, chatta rathalu photolu pettevallani avoid cheyadaniki manaki lucky ga, 'hide all posts by' option undi...kani aa tagging ne avoid cheyalekapotunnam...aa tagging lu ante naku asahyam..edo oka thokkalo bommaki manalni tag chesestaru, manaki sambadham kuda undadu..inka aa photoki janalu viragabadi vedhava replylu, manaki aa sodhi anta notificationlu, kharma ra babu anukonela chestayi..aawww!!!
very good post..pandaga!! :D
As usual you rocked ! Kaani telugu lo chaalaa thappulu unnai..I think I asked you many times and Im asking again : Will you please appoint me a your proof-reader? :)
ధర్మవరపు సుబ్రహ్మణ్యం మిస్టర్ పెళ్ళాం లొ A V S గారికి జోహార్లు పలికినట్టు, 'వాట్ ఎ ఇడ్లీ, ఆహా వాట్ ఎ వొంకాయ కూర' అని కామెంట్ రాయకుండా ఉండలేడు.
అమ్మ తోడు అడ్డంగా ట్యాగ్ చేస్తా - HA HA HA
న్యూస్ ఛానల్ కి కూడా పనికిరాని రకం వీళ్ళు. - This is the real DK Stamp :)
Great attempt !
@Haritha: Naaku telugulo 7 thappulu maaf untayi telusa?
super...
Great write-up! :D
A couple of quick edits you might wanna do :)
అపూహ కాదు అపోహ
సంమంధాలు కాదు సంబంధాలు
బహుబాగా తెలిపారు.....
చాలా బాగుంది.. :))
ఫేస్బుక్ సరిగ్గావాడరా వెధవా అని ఫేస్ మీదే చెప్పారుగా. :)
This is just awesome bro.. "chitikelu chitikelu"
చాలా బాగా రాశారు సుమా!జీవితంలో సగభాగం ఫేస్ బుక్ లోనే గడిపే వాళ్లకు ఉపయోగపడే చిట్కాలు చాలా బాగా చెప్పారు.
చివర్లో ఆర్టీసీని అనుకరిస్తూ రాసిన నినాదం మరీ బాగుంది.
సూపర్ ..అద్బుతంగా ఉంది
Veellu news channel ki kooda paniki raaru. ROFL!!!!!
Post a Comment