Every time a legendary film actor passes away, Twitter behaves in a certain way. This flowchart tries to understand what goes on the mind of that tweeter who hadn't given a damn about the actor until he died (and will never give after that day), but hypocritically pretends to be in the thick of the things on that day.
Saturday, July 13, 2013
Thursday, July 4, 2013
ఆకలి వేసిన శుభవేళ
సాయింత్రం ఆరింటికి, బస్సు దిగగానే ఇంటి వైపు నడవడం మొదలు పెట్టాను. నోరు మూస్కుని ఇంటికి వెళ్ళకుండా, కిళ్ళి కొట్టు వైపు నా కళ్ళు చూడక చస్తాయా. రోడ్ దాటి దారి మార్చాను. రోడ్ దాటాక గుర్తొచ్చింది, ఇంట్లో ఎవరు లెరని. ఇక ఇంటికి కూడా ఎం వెళ్తాం లే అని అల ఒక సిగరెట్ కొని, దాన్ని ఆనందిస్తూ అలా నిలపడ్డాను. ఏ ముహూర్తాన నాకు ఈ ఆలోచన తట్టిందో కాని, ఆ కిళ్ళి కొట్టు వెనుకల సందు లో ఒక దూరపు బంధువు ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్య. ఎలాగో ఇంకొక గంట లో భోజనం టైం, ఇంటికెళ్ళి ఏమి ఒండకుండా ఇక్కడే అడ్జస్ట్ అవుదాం అనుకున్నను. ఆ సందు లోకి మరలడం, నా జీవితం లో చేసిన ఒక పెద్ద తప్పు.
"ఎవరైనా ఉన్నారా?", అంటూ పెద్ద మొనగాడి లాగా గేటు తీసాను. ఇంట్లో వదిన గారు ఒక్కరే ఉన్నరు. నన్ను చూసి లోపలికి రమ్మని పిలిచారు. కడుపులో ఆకలి దంచుతోంది. అరవై ఎళ్ళ వయసుతో వచ్చే కష్టాలు ఇవన్నిఅనుకున్నాను. మంచి నీళ్ళు ఇచ్చారు. తాగి అలా కుర్చునాను. వదినగారేమో అటు ఇటు తిరుగుతునారు. "భోజనం" అనే పదం వినడానికి ఆత్రుత తో ఇనుప సోఫ పైన అలా కూర్చొని ఉన్నాను. వదిన గారు వచ్చి, "టీ తీస్కుంటారా?" అని అడిగారు. ఆకలేస్తుంది, మా ఇంట్లో అందరు ఊరికి వెళ్లారు, నాకు భోజనం లేదా టిఫిన్ పెట్టండి, అని చెప్పే ధైర్యం లేక, సరే, టీ అయినా తాగుదామని "సరే" అన్నను. ఆవిడ వంటింట్లోకి వెళ్లి, అర నిమిషం కూడా కాలేదు, వాళ్ళ ఇంట్లో ఫోన్ మోగింది. వదిన గారు వచ్చి, ఫోన్ తీసి, "హలో!" అని అన్నారు. పది సెకండ్లు విని, హటాతుగా కింద పడిపొయారు. సినిమాలలో రిసీవర్ వేలాడినట్టు, ఇక్కడ కూడా రిసీవర్ వేలాడింది. నాకు టెన్షన్ మొదలైంది. ఒక వైపు ఆకలి. ఇంకో వైపు పాలు పొంగిపొతున్నయి. ఎం జరిగిందో తెలిదు.
వంటింట్లో కి వెళ్ళలా, ఫోన్ లో ఎవరో అని చుడాలా, హాస్పిటల్ కి ఫోన్ చేయాలా, ఏది అర్థం కలెదు. ముందు వెళ్లి గ్యాస్ ఆఫ్ చెసను. పక్కన పోయి మీద ఒక గిన్నలో ఉప్మా కనిపించిన్ది. ఉప్మా లో నెయ్యి వాసనా కి, నా దరిద్రానికి ముడిపడింది. ఈ అరవై ఎళ్ళా జీవితం లో ఇంతకన్న కష్టమైనా క్షణం నేను అనుభవించలెదు. ఎం చేస్తాం, నోరు...కాదు ముక్కు మూస్కొని ఒక గ్లాస్ లో నీళ్ళు తీస్కెళ్ళి వదిన గారి ముఖం మీద చల్లాను. ఆవిడ మాత్రం కదలలెదు. ఇంకా కొన్ని నీళ్ళు చల్లాను. అయినా చప్పుడు లెదు. ఫోన్ సంగతి గుర్తొచ్చిన్ది. రిసీవర్ ఎత్తి, హలో అన్నను. ఇంకేండుకుంటారు లే, అనుకోని, ఇంకా కొన్ని నీళ్ళు తీస్కోచ్చి వదిన ముఖం పైన చల్లాను. ఇన్ని నీళ్ళకి వదిన గారు ఏమి లేవలేదు కాని, ఆవిడ బట్టలు మాత్రం తడిసి పొయాయి. మాడిన నా అదృష్టానికి, అప్పుడే నా ఫోన్ మోగింది. నా మనవడు చేసిన ఘనకర్యానికి, ఎన్టీఆర్ గారి "ఆకు చాటు పిండ తడిసే" పాట రింగ్టోన్ లా మొగిన్ది. వదిన తడిసిన చీర కి, ఈ పాటకి, ఆకలి తో మాడుతున్న నా కడుపుకి, నా దరిద్రానికి ఎంత సమయస్పుర్తూ!
ఫోన్ ఎత్తాను. "సార, మీకు లోన్ ఏమైనా కావాలా" అని ఒక ఆడ మనిషి అదిగిన్ది. ఇలాంటి సమయం లో ఓర్పు చాలా అవసరం. ఒక ఫోన్ వల్ల వచ్చిన చావు చాలు అనుకుని, వదిన ముఖం తన కొంగుతోనే తుదిచను. కొంగు నా చేతిలో ఉండగా, ఎవరైనా చూస్తె ఎం అనుకుంటారో అన్న భయం ఇప్పటికి మరిచిపొలెను. ఇక వేరే మార్గం లేక వదిన చంపల మీద రెండు లాగి కొట్టాను. అప్పుడు ఆవిడ కళ్ళు తెరిచిన్ది. "ఏమైంది?" అని అడిగాను.
"మన శృతి...." అని రెండు పదాలు మాట్లాడి, మళ్ళి స్పృహ కొలిపోయిన వదిన, ఈ సారి నా చొక్కా గట్టిగా పట్టుకుంది. లేద్దామనుకుంటే చొక్కా చినిగే అవకాశాలు చాలా కనిపించాయి. వదిన కి ఎం జరిగిందో, ఫోన్ లో ఎవరేమన్నారో ఇంకా క్లారిటీ లేదు కని, ఆ సమయంలో ఎవరైనా చూస్తే ఎం జరుగుంటుందో అన్నది మాత్రం నాకు క్లియర్ గ అర్థమయ్యిన్ది. రెస్ట్ తీస్కునే వయసులో అరెస్ట్ అయ్యే టైం వచ్చిన్ది.
ఇక ధైర్యం చేసి, చొక్కా ఒదిలించుకున్నను. అప్పుడే, మల్లి ఫోన్ మొగిన్ది. ఫోన్ చప్పుడు కి వదిన లెచరు. మల్లి ఫోన్ లో ఏదో విన్నరు. అరటి పండు కోసం కోతి జాగ్రత్త గా ఎలా ఎదురు చూస్తుందో, అలా ఆ సంభాషణ ముగింపు కోసం నేను కూడా ఎదురు చుసను. ఈ ఐదు సెకంద్లలో నేను ఆశావాదం నా ధర్మంగా స్వీకరించను. కానీ, కాలిన ఖర్మని , రామ్ గోపాల్ వర్మ నీ, ఏమి చెయలెము. వదిన గారు మళ్ళి స్పృహ తప్పారు. ఈ సారి, ఆవిడని కింద పడనివ్వకుండా, నేను అడ్డొచ్చి, ఆవిడని నా వడిలో తీస్కొని కింద పడ్డాను. తలుపు తెరిచే ఉంది. గేటు శబ్దం వినిపించిన్ది. నాకు కళ్ళా ముందు రాజముండ్రి జైలు కనిపించిన్ది.
రెండు క్షణాల తరువాత, రవి వచ్చాడు. వాళ్ళ అమ్మని నా వడిలో పడుకొపెతటుకొని,"బాబు రవి" అని అన్నాను. పోయిన సారి అతను ఎక్షమ్ లో ఫెయిల్ అయినప్పుడు నేను అతనిని తిట్టిన తిట్లు గుర్తుకొచ్చయి. సందర్భం చూసి పగ తీర్చుకుంటాడా ఏంటి అని ఒక సందేహం నాకు సూదిలా గుచ్చుకున్ది. "బాబాయ్ మీరు.... ఎం జరిగింది? అమ్మకి ఏమైంది?" అని రవి నా వైపు అనుమానం తో చూసాడు.
"అదీ, అదీ, నెను... ఊరికే అలా..." అనేవరకు, మళ్ళి ఫోన్ మొగిన్ది. ఇక ఈ టైం లో దేవుడు నన్ను తీస్కేల్తే బావుంటుంది అని నా అరవై ఎళ్ళ జీవితం లో మొదటి సారి అనిపించిన్ది. ఫోన్ పెట్టిన రవి తన అమ్మని నా వడిలో నుంచి లేపి, మంచం మీద పడుకొపెట్టాడు. "అమ్మా..." అని ఒక సరి అన్నాడు. పొద్దున్నే సూర్యుడు ఉదయించడం, బిడ్డ పిలుపుకి అమ్మ పలకడం, సహజం.
"అమ్మ, ఏమయ్యింది నీకు?" అన్నాడు రవి.
"శృతి..." అన్నారు వదిన.
"అక్క కి ఏమి అవలెదు. స్కూటీ మీద నుంచి కింద పడింది. గుద్దిన వాడు పరిపొయఆడట" అన్నాడు రవి.
"మరి ఆ వెధవ శృతి పారిపోయింది అంటాడెంటి?"
"ఆమ్మ!! అక్క పారిపొలెదు. అర గంట లో ఇంటికి వస్తున్ది."
ఈ మాట అని రవి, నా వైపు మరలాడు. "థాంక్స్ బాబాయి గారు. మీరు ఉండకపోతే ఎం జరిగేదో" అని నాకు కృతజ్ఞ్యతలు చెప్పాడు. సుబ్బులక్ష్మి గారి సుప్రభాతం విన్నంత సుఖం అనుభవించాను. ఇక ఇంటికి వెళదాం అని బైల్దేరే ఆలోచనలో ఉండగా, వదిన గారు నా వైపు చూసి, "బావగారు, ఎలాగో భోజనం టైం అయ్యింది, మరి మీరు.....".
- దీపక్ కారాముంగికర్.
Subscribe to:
Posts (Atom)